నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు..
23-11-2026 | 11:41pm
వేలాదిమందితో కిటకిటలాడిన కొండగట్టు..
మల్యాల, నవంబర్ 23 (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు(Kondagattu) శ్రీ ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి నిజరూప దర్శనం కోసం వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జై హనుమాన్ నామస్మరణతో కొండగట్టు క్షేత్రం మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.