మహిళా సర్పంచ్‌పై ఉపసర్పంచ్ దురుసు ప్రవర్తన..
ఉపసర్పంచ్ నవీన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు..
కోనరావుపేట, నవంబర్ 23 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామ ఉపసర్పంచ్ తిక్కల నవీన్‌పై గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా(Sarpanch Sheikh Yasmin Firoz Pasha) పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కోనరావుపేట ఎస్‌ఐ రామ్మోహన్‌ను మండల మహిళా సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మానుక సత్తయ్య, కోనరావుపేట ప్యాక్స్ చైర్మన్ గంగాధర్‌లతో కలిసి ఆమె ఫిర్యాదు చేశారు.
గ్రామంలో పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి దసరా పండుగ ఖర్చులు, గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ఖర్చులపై వార్డు సభ్యులతో చర్చిస్తున్న సమయంలో ఉపసర్పంచ్ తిక్కల నవీన్ ఉద్దేశపూర్వకంగా తన సెల్‌ఫోన్‌లో వీడియోలు తీస్తూ దూషించాడని సర్పంచ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ క్రమంలో తన భర్త అక్కడికి వచ్చి ఉపసర్పంచ్ ప్రవర్తన సరైనది కాదని చెప్పగా, నవీన్ తన భర్తను అసభ్య పదజాలంతో దూషించి దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు. మహిళా సర్పంచ్ అయిన తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపసర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఈ ఫిర్యాదు సందర్భంగా సర్పంచులు ఆమని, లక్ష్మి, స్వప్న, గౌతమి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.