డెత్ సర్టిఫికెట్ తో మార్చిన భూమి రిజిస్ట్రేషన్
- తుంగతుర్తి రెవెన్యూ కార్యాలయంలో.. బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తో భూమి మార్పిడి
- ఓ తండ్రిని మోసం చేసిన కొడుకు
- రెవెన్యూ అధికారులు, డెత్ సర్టిఫికెట్ తీసుకొచ్చిన వారిపై క్రిమినల్ కేసులు... లేనట్లేనా??
- తుంగతుర్తిలో ఆలస్యంగా వెలుగు చూసిన వైనం
తుంగతుర్తి (విజయక్రాంతి): నవ మాసాలు మోసి, భూమి మీద కన్న తల్లిదండ్రుల వద్ద ఉన్న సుమారు 2 ఎకరాల భూమి కోసం, తండ్రి చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించి, తండ్రి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు... తుంగతుర్తి(Tungaturthi) మండలం సూర్య తండ గ్రామపంచాయతీకి చెందిన, ఓ గిరిజన రైతు తండ్రి, తన పాలు కొచ్చిన రెండు ఎకరాల భూమిని, సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అతని కన్నా కొడుకు అతని భాగంగా ఇచ్చిన భూమి ఉన్నప్పటికీ, తండ్రి తన బిడ్డలకు ఇస్తాడేమోనని, ఆలోచన చేసి, చివరికి తన తండ్రి చనిపోయినట్లు అధికారులకు డబ్బులు ఏరా చూపించి డెత్ సర్టిఫికెట్ను పొంది, రెవెన్యూ అధికారులను డబ్బులతో మోసం చేసి, తండ్రి బతికుండగానే చనిపోయినట్లు, పలువురితో సంబంధాలు పెట్టుకుని, అంతా కలిసి, తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి, స్థానిక తహసీల్దార్ తో, రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం.
గడిచిన రెండు రోజుల క్రితం తండ్రి ఓ బ్యాంకుకు లోన్ తీసుకోవడానికి వెళ్లగా, అరేయ్ యాడియే, నీవు చనిపోయినట్లు, సర్టిఫికెట్ తో వచ్చారు, ఇదేందిరా బాబు అని, బ్యాంక్ అధికారులు ప్రశ్నించగా, జరిగిన సంఘటన మొత్తం బట్టబయలైంది. సమాజంలో ప్రస్తుతం డబ్బులకు దాసోహం అవుతున్న తరుణంలో, ఏకంగా, నీచంగా ,కన్నకొడుకే.. బతికి ఉన్న.. డెత్ సర్టిఫికెట్ను సృష్టించడం, తదుపరి రిజిస్ట్రేషన్ చేయించడం.. ఆ నోట ఈ నోట పడడం.. ప్రస్తుతం ఈ సంఘటన వైరల్ గా మారింది.
జరిగిన సంఘటనపై ఫోన్లో తాసిల్దార్ వివరణ కోరగా, డెత్ సర్టిఫికెట్ను చూపించి తప్పు త్రోవ పట్టించారని, తప్పుగా రిజిస్ట్రేషన్ జరిగిందని, వాపోయారు. జిల్లా ఉన్నతాధికార దృష్టికి తీసుకుని వెళ్లి, తిరిగి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తానని తెలిపారు. స్థానిక విలేకరులు బెదిరింపుల గురి చేసి, డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. తుంగతుర్తి రెవెన్యూ కార్యాలయంలో జరిగిన సంఘటనపై, జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి, కారకులైన సంబంధిత రెవెన్యూ అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని, పేద రైతులు, ప్రజలు కోరుతున్నారు.