కాంటినెంటల్లో ‘రోసా వన్ బ్రెయిన్’ న్యూరో రోబోటిక్ సిస్టమ్ ప్రారంభం
హైదరాబాద్, అక్టోబర్ 13(విజయక్రాంతి): న్యూరోసైన్సెస్ రంగంలో(The field of neurosciences) అత్యాధునిక వైద్య సాంకేతికతను(Medical technology) అందుబాటులోకి తీసుకువస్తూ హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్స్(Continental Hospitals) రోసావన్ బ్రెయిన్ న్యూరో రోబోటిక్ సిస్టమ్ను ప్రారంభించింది. ఆసుపత్రిలోని వివిధ వైద్య విభాగాల్లో 500 రోబోటిక్ శస్త్రచికిత్సలను(Robotic surgery) విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) రూపొందించిన అత్యాధునిక సిగ్నా హీరో 3.0టీ బ్రెయిన్ ఎంఆర్ఐ వ్యవస్థను కూడా ఆవిష్కరించింది.
తల భాగానికి సంబంధించిన అధిక స్పష్టతతో కూడిన చిత్రాలను అందించేందుకు రూపొందించిన ఈ వ్యవస్థ మెదడు వ్యాధుల నిర్ధారణలో కీలకంగా నిలవనుంది. ఈ సందర్భంగా కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్. రెడ్డి మాట్లాడుతూ, దేశంలో పలు వైద్య విభాగాల్లో రోబోటిక్ శస్త్రచికిత్స సాంకేతికతను సమగ్రంగా వినియోగిస్తున్న ఆసుపత్రుల్లో కాంటినెంటల్ హాస్పిటల్స్ ఒకటని తెలిపారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, న్యూరోసర్జరీ వంటి విభాగాల్లో రోబోటిక్ సాంకేతికతను ఉపయోగిస్తూ రోగులకు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.
రోబోటిక్ శస్త్రచికిత్సలు వైద్యరంగంలో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నాయన్నారు.తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వివిధ విభాగాల్లో రోబోటిక్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, రోసా వన్ బ్రెయిన్ న్యూరో రోబోటిక్ సిస్టమ్ ఈ దిశగా మరో కీలక ముందడుగు అని తెలిపారు.కాంటినెంటల్ హాస్పిటల్స్లో మినిమ ల్లీ ఇన్వేసివ్ ఎండోస్కోపిక్ న్యూరోసర్జరీ, న్యూరో ఆంకాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ హృషికేశ్ సర్కార్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ శివానంద్ రెడ్డి మాట్లాడుతూ, రోసా వన్ బ్రెయిన్ అనేది కంప్యూ టర్ ఆధారిత మార్గదర్శకత్వంతో పనిచేసే అత్యాధునిక న్యూరో రోబోటిక్ వ్యవస్థ అని వివరించారు.
డాక్టర్ కె. సుధీర్, సీనియర్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్, ఇండియన్ రేడియాలజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియే షన్ (ఐఆర్ఐఏ) తెలంగాణ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, 3 టెస్లా (3టీ) ఎంఆర్ఐ సాంకేతికత న్యూరోఇమేజింగ్ రంగంలో గణనీయమైన పురోగతిని తీసుకొచ్చిందని తెలిపారు. కాంటినెంటల్ హాస్పిటల్స్లో న్యూరాలజీ, న్యూరోసర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల నిపుణులు సమన్వయంతో పనిచేస్తూ సంక్లిష్టమైన మెదడు, నాడీ వ్యవస్థ వ్యాధులకు ఆధునిక చికిత్స అందిస్తున్నారని ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు.అత్యాధునిక రోబోటిక్ శస్త్రచికిత్స సాంకేతికత, అధునాతన న్యూరోఇమేజింగ్ వ్యవస్థలను సమన్వయం చేయడం ద్వారా రోగులకు మెరుగైన రోగనిర్ధారణ, చికిత్సా అవకాశాలను అందించడ మే తమ లక్ష్యమన్నారు.