బాధిత కుటుంబాలకు మౌనిష్ రెడ్డి ఆర్థిక సాయం

14-10-2026 | 11:21pm

తలమడుగు,(విజయక్రాంతి): తలమడుగు మండలంలోని ఖోడద్ గ్రామానికి చెందిన రవీందర్ రోడ్డు ప్రమాదం(Road Accident)లో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి(Social worker Mudupu Mounish Reddy) పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. దేవాపూర్‌కు చెందిన దారవేణి రాములు కుటుంబాన్ని, తలమడుగు మండల కేంద్రానికి చెందిన కాడే లస్మన్న కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం(Financial assistance) చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెద్దింటి ప్రవీణ్‌ను సైతం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఖోడద్ సర్పంచ్ ఏముల ప్రియాంక లక్ష్మారెడ్డి, దేవాపూర్ సర్పంచ్ పోరండ్ల సంతోష్, కిరణ్ దాతా, నరేందర్ రెడ్డి, వసీమ్, కిషోర్ రావు, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు