దుర్గాదేవి సన్నిధిలో కుంకుమ పూజ

14-10-2026 | 11:19pm

కొడిమ్యాల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagityal District) కొడిమ్యాల మండల కేంద్రంలోని వందేమాతరం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నాల్గవ రోజు దుర్గాదేవి మహా చండి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం దుర్గాదేవి మండపంలో మహిళలు కుంకుమ పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పూజారి లక్ష్మణ్ శర్మ, ఏనుగు ఆదిరెడ్డి, బైరి రవీందర్, కాసం మునిందర్, వందేమాతరం ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు