ముమ్మరంగా సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు
14-10-2026 | 10:53pm
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్ గ్రామంలో దసరా పండుగ పురస్కరించుకొని సద్దుల బతుకమ్మ పండుగ(Saddula Bathukamma Festival) రోజున ఎలాంటి ఆటంకం కలుగకుండా పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేయడంతో పాటు ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ కిచ్చిగారి భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ సీత మహేష్ యాదవ్ సమక్షంలో సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు ముమ్మరంగా జరిగాయి. ఇందులో గ్రామ సెక్రెటరీ, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.