రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్

14-10-2026 | 03:32pm

చార్మినార్ నుంచి హైటెక్ సిటీ వరకు.. హైదరాబాద్ బిజినెస్ కథలో కొత్త అధ్యాయం

తెలంగాణ టార్గెట్ 3 ట్రిలియన్ డాలర్లు

తెలంగాణను మార్చే 3 ప్లాన్లు.. CURE, PURE, RARE

హైదరాబాద్: తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దడంతో పాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భారీ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన SAMAKHYA Business Summit 2026 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దేశ GDPలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉందని, దాన్ని 10 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, రాష్ట్ర అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి: స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణ Rising 2047 Vision లక్ష్యాల సాధన కోసం రాష్ట్రాన్ని CURE, PURE, RARE అనే మూడు ఆర్థిక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం వివరించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాన్ని CURE (Core Urban Region Economy)గా తీర్చిదిద్ది IT, సేవారంగం, ఆధునిక టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ORR నుంచి Regional Ring Road వరకు ఉన్న ప్రాంతాన్ని PURE (Peri Urban Region Economy)గా అభివృద్ధి చేసి manufacturing industries, industrial parks, logistics రంగాలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో RARE (Rural Agriculture Region Economy) ద్వారా agriculture, food processing, వ్యవసాయాధారిత పరిశ్రమలు, గ్రామీణ ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.

పెట్టుబడిదారులు, యువ పారిశ్రామికవేత్తలు, మహిళా వ్యాపారవేత్తలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇప్పటివరకు కార్పొరేట్ సంస్థలకు సేవలు అందించే స్థాయిలో ఉన్న స్థానిక యువత సొంతంగా పెట్టుబడులు పెట్టి Global Business Entrepreneursగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళల భాగస్వామ్యం పెరిగిన దేశాలే ఆర్థికంగా బలపడుతున్నాయని పేర్కొంటూ, తెలంగాణలో మహిళలకు రూ.61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణలోనూ మహిళలను యజమానులుగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్(Samakhya Chamber of Commerce) యువతతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సూచించారు. పెట్టుబడులకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని, తెలంగాణను అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు