కాంటినెంటల్లో అవంత్రా బ్రెస్ట్ సెంటర్
హైదరాబాద్, అక్టోబరు 29 (విజయక్రాంతి): రొమ్ము క్యాన్సర్ పరీక్షలు, ముందస్తు గుర్తింపు, చికిత్స, శస్త్రచికిత్స, చికిత్స అనంతర సంరక్షణ వంటి సేవలను ఒకే చోట అందించేందుకు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్స్లో ‘అవంత్రా బ్రెస్ట్ సెంటర్(Avantra Breast Center)’ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ సర్జన్ డాక్టర్ చైతన్యానంద్ బి. కొప్పికర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ చైతన్యానంద్ బి. కొప్పికర్ మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్ చికిత్స లో వివిధ వైద్య విభాగాల సమన్వయం కీలకమని తెలిపారు.
మా మోగ్రఫీ, జన్యుప రమైన సలహాలు, కీమోథెరపీ, రేడియేషన్, పునర్నిర్మాణ శస్త్రచికిత్స వంటి సేవలు రోగులు త్వరగా కోలుకోవడానికి దోహదపడతాయన్నారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఆధునిక వైద్య సేవలతోపాటు ధైర్యాన్ని అందించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామ న్నారు. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్స, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్, ఉపశమన చికిత్స, చికిత్స అనంతర సంరక్షణ తోపాటు ప్రపంచస్థాయి వైద్య నైపుణ్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.