సీఎం ఆర్ ఎఫ్ దరఖాస్తులపై విచారణ
కాగజ్ నగర్ ,అక్టోబర్ 30 ( విజయ క్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో ముఖ్యమంత్రి సహాయ నిధి( సీఎంఆర్ఎఫ్ )(Chief Minister's Relief Fund) ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు చేసుకున్న హాస్పిటల్ బిల్లుల చెల్లింపు ల పై జిల్లా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ సీతారాం(District Deputy DM&HO Dr. Sitaram) విచారణ చేపట్టారు.
తెలంగాణ ప్రభుత్వం నుండి అందిన ఆదేశాల మేరకు శుక్రవారం డాక్టర్ సీతారాం కాగజ్ నగర్ పట్టణంలో గల వివిధ హాస్పిటల్ లో చికిత్సలు పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు చేసుకున్న వారి వివరాల పై డాక్టర్ సీతారాం విచారణ చేపట్టారు.
పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్, రుద్ర, కిమ్స్, షణ్ముఖ, విజేత హాస్పిటల్ లలో వైద్యం చేయించుకున్న వారు ముఖ్యమంత్రి సహాయనిధి కోసం రియంబర్స్మెంట్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నట్టు తెలిపారు. గతంలో హైదరాబాదు, కరీంనగర్ తదితర పెద్ద నగరాల్లో వైద్యం చేయించుకుని చికిత్స పొందిన వారి వివరాలను విచారించే వారనీ డాక్టర్ సీతారామ తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ ఐదు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించబడుతుందని డాక్టర్ సీతారాం వివరించారు.