అఖిల భారత యాదవ సంఘం ఉపాధ్యక్షుడిగా చిట్టవేణి సదయ్య యాదవ్

30-10-2026 | 02:57pm
  1. జిల్లాలో యాదవుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తా
  2. యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సదయ్య యాదవ్

పెద్దపల్లి, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): అఖిల భారత యాదవ సంఘం(All India Yadav Association) పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా చిట్టవేణి సదయ్య యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సదయ్య యాదవ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించి,

ఆశీర్వదించిన జిల్లా అధ్యక్షుడు మల్లేశం యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల రాజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పెగడ రమేష్ యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు బక్కన్న యాదవ్ తో పాటు సంఘం కుల పెద్దలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాలో 

యాదవ సోదరుల ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని సదయ్య యాదవ్ తెలిపారు. జిల్లాలో యాదవ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

సదయ్య యాదవ్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో యాదవ సంఘం మరింత అభివృద్ధి చెందాలని, యాదవ యువత అభ్యున్నతికి, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు కృషి చేయాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు