తలసేమియా చిన్నారుల కోసం పోలీసుల రక్తదాన శిబిరం

27-10-2026 | 08:20pm

200 మంది రక్తదానం డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

కోదాడ అక్టోబర్ 27,(విజయ క్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం(Police Commemoration Day) సందర్భంగా తలసేమియా(Thalassemia ) చిన్నారుల కోసం మంగళవారం కోదాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సబ్‌ డివిజన్‌కు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు 200 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు తరచూ రక్తం అవసరమవుతుందని, వారికి అవసరమైన సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకునే సందర్భాన్ని సామాజిక సేవకు వేదికగా మార్చి రక్తదానం చేయడం కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా నిరంతరం రక్తం అవసరమయ్యే తలసేమియా చిన్నారులకు రక్తదాతలు అండగా నిలవాలని సూచించారు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన పెంచుకుని ముందుకు రావాలని కోరారు.

ఈకార్యక్రమంలో పట్టణ సీఐ శివశంకర్, రూరల్‌ సీఐ రామకృష్ణారెడ్డి, మునగాల సీఐ ప్రతాప్‌లింగం, హుజూర్‌నగర్‌ సీఐ చరమంద రాజు, సబ్‌ డివిజన్‌కు చెందిన ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు