బీసీల పట్ల కేంద్రానిది సవితి తల్లి ప్రేమ

27-10-2026 | 08:40pm

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో(Bhagat Singh Bhavan) బీసీ హక్కుల సాధన సమితి మండల నూతన కమిటీ ఎన్నిక సమావేశం జరిగింది. పట్టి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు వనం సత్యనారాయణ, అతిథిగా సీపీఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్, హాజరయ్యారు.

బీసీల పట్ల కేంద్రానిది సవతి తల్లి ప్రేమ జనగణలో బీసీ ప్రస్తావన చేయకుండా, కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల సవతి తల్లి ప్రేమ కనపరుస్తుందని విమర్శించారు., బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధానమంత్రిని అని చెప్పుకుంటూ నరేంద్ర మోడీ నిజానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఆరోపించారు.

తను మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు అతని కులం ఓసి సామాజిక వర్గానికి చెందినదన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత అధికారాన్ని ఉపయోగించుకొని మోదీ తన కులాన్ని బీసీ సామాజిక వర్గానికి మార్పిడి చేసుకున్నారని స్పష్టం చేశారు.  నరేంద్ర మోడీ కి బీసీల పట్ల ప్రేమ లేదని విమర్శించారు.

బీజేపీ కూడా అగ్రవర్ణాల పార్టీగా ముద్ర పడిపోయిందని, అందువల్లనే జన గణ కుల గణ న చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టనున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించేది ఆర్ఎస్ఎస్ ఆధినేత మోహన్ భగవత్ అనేది జగద్వితమన్నారు.

అగ్రకుల  భావజాలంతో ఏం చెప్పినా నరేంద్ర మోడీ అదే చేస్తారని, భారతదేశాన్ని ముక్కలు చేయడమే ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానమని మండిపడ్డారు. గత ఎనిమిది శతాబ్దాలుగా బీసీలను ఓట్లు వేసే మిషన్లుగా మాత్రమే చూస్తున్నారని వాపోయారు.   కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు బీసీలను మోసం చేసి 42 శాతం రిజర్వేషన్లను ఇస్తామని, కేవలం 21 శాతానికి పరిమితం చేశారయన్నారు.

మండల కమిటీ ఎన్నిక

బీసీ హక్కుల సాధన సమితి మండల కమిటీ ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ముత్తే శంకర్, కార్యదర్శిగా వాసాల నాగరాజు, కోశాధికారిగా పంబాల సరిత,11 మందిని కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు