అల్వాల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డిసిపి
అల్వాల్, అక్టోబర్ 27,(విజయక్రాంతి): అల్వాల్ పోలీస్ స్టేషన్ ను(Alwal Police Station) మంగళవారం డిసిపి శ్రీధర్ ఐపీఎస్(DCP Sridhar, IPS) ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిఎస్ లోని పలు రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులు, కేసుల పురోగతి, విధుల నిర్వహణ తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు.
అంతకు ముందు ఆయనకు, పోలీసుల నుంచి గౌరవ వందనం లభించింది. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణ కోసం విస్తృత తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని కోరారు.ఆయన తో పాటు ఏసిపి రమేష్, అల్వాల్ సీఐ ప్రశాంత్, డిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు చంద్రశేఖర్, దేవేందర్, గీత, హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.