ఎఫ్​సీఐలో ఆవరణంలో శానిటేషన్​ స్పెషల్ క్యాంపెయిన్​...

23-10-2026 | 08:14pm

వరంగల్, అక్టోబర్ 23 విజయక్రాంతి): ఫూడ్ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా(Food Corporation of India) కాజీపేటలో ప్రత్యేక శానిటేషన్​లో భాగంగా శుక్రవారం స్పెషల్ క్యాంపెయిన్​6.0ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్​సీఐ డివిజనల్​ మేనేజర్​ నేత్ర ప్రకాశ్​ మాట్లాడుతూ స్వచ్ఛాత నేపథ్యంలో కాజీపేటలోని ఎఫ్​సీఐ ఆవరణంలోని పలు చోట్ల పిచ్చి చెట్లను తీసివేయడంతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేయడం జరుగుతుందన్నారు.

పరిశుభ్రతను కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. స్పెషల్ క్యాంపెయిన్ 6.0 లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ఎఫ్‌ఎస్‌డీ కాజీపేట పరిసరాలను మరింత శుభ్రంగా, చక్కగా తీర్చిదిద్దడమే కాకుండా పరిశుభ్రత పట్ల అవగాహనను పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్​సీఐ ఏజీఎం ఇంధు, మేనేజర్లలు రాజేంద్రప్రసాద్​, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్​ రెడ్డి, ప్రసన్న కుమార్​, ఇమ్రాన్​, శ్రీకాంత్ కుమార్​, ఎఫ్​సీఐ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు