యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు
మహబూబాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): యాసంగి సీజన్(Rabi season) లో ఆరుతడి పంటల సాగు(Cultivation of semi-dry) మేలు చేస్తాయని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్(District Collector Sneha Sabarish) తెలిపారు. పెద్దవంగర మండలం అవుతాపురం రైతు వేదికలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం ద్వారా రైతులకు(Farmers') అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో, వర్షాభావ పరిస్థితుల్లో బోర్లు, బావులు కింద నిత్య ఆదాయం ఇచ్చే మార్కెట్ డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్(Oil Palm), కోకో, వక్క, జాజికాయ, మిరియాలు, కొబ్బరి, కూరగాయలు, ఉల్లి, పండ్ల తోటలు, పూలు, మల్బరీ, మునగ, మొదలైన ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు తెలిపారు.
ఈ సందర్బంగా రైతులు(Oil Palm) వాంకుడోతు చిలుకమ్మ, సోంల, బానోతు శ్రీనివాస్ సాగు చేస్తున్న కూరగాయలు, పుచ్చ, కర్బూజ, బొప్పాయి సాగు గురించి అడిగారు. బిందు సేద్యం, మల్చింగ్ మొదలైన రాయితీలు ఉపయోగించుకొని సాగు చేస్తున్నామని వివరించారు. కూరగాయలు, పుచ్చ, కర్బూజ, బొప్పాయి పంటల సాగుతో స్వల్ప కాలంలోనే ఎకరానికి ఖర్చులు పోను రెండు లక్షల ఆదాయం పొందుతున్నామని వివరించారు.
ఖమ్మం జిల్లాలో రైతుల నుండి వీటి సాగు తెలుసుకొని గత పది సంవత్సరాల నుండి పత్తి, మిరప, వరికి బదులుగా ఆరు తడి పంటలైన కూరగాయలు, పుచ్చ, కర్బూజ, బొప్పాయి సాగు చేస్తున్నామని తెలిపారు.ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో పశువుల సంరక్షణపై కలెక్టర్ రైతులకు సూచించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ రైతులకు పశు గ్రాస విత్తనాలను పంపిణీ చేశారు.ఈ అవగాహన కార్యక్రమంలో డిఆర్డిఏ పీ డీ మధుసూదన రాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జినుగు మరియన్న, పశుసంవర్ధక శాఖ అధికారి కిరణ్ కుమార్, కూరగాయల రైతులు కోమరబోయిన ఎల్లయ్య, కోడిశెట్టి శ్రీనివాస్, బోయిన ఉప్పలయ్య, వాంకుడోతు చిలుకమ్మ పాల్గొన్నారు.