ప్రమాదానికి గురైన కానిస్టేబుల్ రవి

23-10-2026 | 09:55pm
  1. తక్షణ సాయం అందించిన బ్యాచ్ మెంట్స్..
  2. కుటుంబానికి ధైర్యం ఇచ్చిన స్నేహితులు.

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): విధి నిర్వహణలో అకస్మాత్తుగా ప్రమాదం జరిగి గాయాల పాలైన స్నేహితుడికి మేమున్నామంటూ ఆపన్న హస్తం అందించారు తోటి బ్యాచ్ మేట్స్.  టేకులపల్లి పోలీస్ స్టేషన్లో(Tekulapally Police Station) విధులు నిర్వహిస్తున్న పి. రవికుమార్ విధి నిర్వహణలో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా లారీ ఢీకొనడం వల్ల ప్రమాదానికి గురై మోకాలి భాగంలో తీవ్రమైన గాయమైంది.  చికిత్స నిమిత్తం కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో ఉన్న వరుణ్ హాస్పటల్ నందు మోకాలుకు సర్జరీ చేసినారు.

కానిస్టేబుల్ రవికి జరిగిన ఆక్సిడెంట్ కి స్పందించి 2009 బ్యాచ్ కానిస్టేబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్, మోహన్, జహీర్ లక్ష్మణరావు, సురేష్, చికిత్స కొరకు రూ 50 వేల తక్షణ సహాయం అందించి మానవతను చాటుకున్నారు.  2009 బ్యాచ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి సహాయం అందించి తోటి మిత్రునికి మేమున్నామంటూ భరోసా కల్పించడం నిజంగా అభినందనీయం .

మరిన్ని వార్తలు