గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..

23-10-2026 | 09:38pm
  1. అటవీ శాఖ అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
  2. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు, అక్టోబర్ 23 (విజయక్రాంతి): గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్(District Collector Borkhade Hemant) సహదేవరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ శాఖాధికారి వికాస్ మీనా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాలలో సోలార్ లైట్ల ఏర్పాటు, బోర్ల తవ్వకం, రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు అవసరమైన అటవీ శాఖ అనుమతులపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని, అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి అనుమతుల కోసం పూర్తి వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు