ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మొద్దు

23-10-2026 | 09:58pm

ఇనుగుర్తి, అక్టోబర్ 23 (విజయక్రాంతి): వైద్యుని ప్రిస్క్రిప్షన్(Doctor's prescription) లేకుండా మందులను విక్రయించవద్దని మెడికల్ షాపు యజమానులకు(Medical shop owners) ఇనుగుర్తి ఎస్ఐ(Inugurthi SI) సూచించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరిష్(Mahabubabad District SP Shabarish) ఆదేశాలతో ఇనుగుర్తి మండల కేంద్రంలోని మెడికల్ షాపు ల్లో ఎస్ ఐ తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్ర మాత్రలు, మత్తు కలిగించే డ్రగ్స్ సంబంధిత మందులు అమ్మరాదని యాజమాన్యాలను ఆదేశించారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకే ఈ చర్యలని, నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు