రాజ్యాంగ విలువల పరిరక్షణే బహుజన సమాజ అభివృద్ధికి పునాది

26-11-2026 | 07:54pm

వరంగల్: రాజ్యాంగ విలువల పరిరక్షణ తోనే బహుజన సమాజ అభివృద్ధికి పునాది అని, భారత రాజ్యాంగమే బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టో గా(Bahujan Samaj Party Manifesto) నిర్ణయించిందని బి.ఎస్.పి వరంగల్ జిల్లా అధ్యక్షులు వనం మహేందర్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా కాశిబుగ్గ జంక్షన్ లో అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి, రాజ్యాంగ ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి మౌలిక సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా వనం మహేందర్ మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో నవంబర్ 26వ తేదీ ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజని, 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందని తెలిపారు. 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. కులం, మతం, ప్రాంతం, భాష, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడికి రాజ్యాంగం సమాన గౌరవాన్ని కల్పించిందన్నారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు అధ్యక్షులు జన్ను అనిల్ కుమార్, వరంగల్ జిల్లా కోశాధికారి పోలేపాక లోకేష్, ఉపేందర్, తూర్పు జనరల్ సెక్రెటరీ రజనీకాంత్, సెక్రెటరీ శేఖర్, మనోహర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు