విజయక్రాంతి న్యూస్: నేటి తాజా వార్తలు – 26 నవంబర్ 2026

26-11-2026 | 12:00pm

1. సత్యనారాయణ కస్టడీకి గ్రీన్‌సిగ్నల్


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) రాగిరి సత్యనారాయణను మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతించింది.  పూర్తి వార్త చదవండి →


2. తెలంగాణకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. తిరుమల పర్యటన అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుని, పాల్వంచలోని నవభారత్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక సుదర్శన హోమంలో పాల్గొని పూజలు చేయనున్నారు.  పూర్తి వార్త చదవండి →


3. ఉగ్రదాడి బెదిరింపు.. పోలీసుల హైఅలర్ట్

నగరంలో ఉగ్రదాడులు జరగవచ్చంటూ వచ్చిన ఓ బెదిరింపు ఈమెయిల్ కలకలం రేపింది. దీంతో హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) అప్రమత్తమై కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పూర్తి వార్త చదవండి →


4. నేడు హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ

రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day) పురస్కరించుకుని తెలంగాణ కాంగ్రెస్ భారీ ర్యాలీ(Telangana Congress Rally)కి సిద్ధమైంది. పూర్తి వార్త చదవండి →


5. కృష్ణా జలాల పంపిణీపై కుదరని ఏకాభిప్రాయం

కృష్ణా డెల్టా సిస్టమ్(Krishna Delta System) (కేడీఎస్)కు నీటిని కేటాయించే అంశంపై రెండు రాష్ట్రాలు భిన్న వైఖరులు తీసుకోవడంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(Krishna River Management Board) (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. పూర్తి వార్త చదవండి →


6. కుటుంబంతో కలిసి ఓటేసిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(AP CM Chandrababu Naidu) నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.  పూర్తి వార్త చదవండి →


7. ట్రేడ్ డీల్ కుదిరితే 17%.. లేకుంటే 25% సుంకం

 భారత్‌-అమెరికా వాణిజ్య సంబంధాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారైతే భారత దిగుమతులపై సుంకాన్ని 17 శాతానికి పరిమితం చేస్తామని అమెరికా ప్రకటించింది.  పూర్తి వార్త చదవండి →


8. టాప్ ప్లేస్‌కు చేరువలో బుమ్రా

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Indian star pacer Jasprit Bumrah) ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో(ICC Test rankings) అగ్రస్థానానికి చేరువయ్యాడు. చాలా రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్(Test match) ఆడిన బుమ్రా కివీస్‌పై ఐదు వికెట్లతో సత్తా చాటాడు.    పూర్తి వార్త చదవండి →


9. నేడే అచ్చంపేటకు సీఎం రేవంత్

నాగర్ కర్నూల్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.  ఈ సందర్భంగా సుమారు రూ.450 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.  పూర్తి వార్త చదవండి →


10. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు(Indian Stock Markets) గురువారం స్వల్ప హెచ్చుతగ్గులతో ప్రారంభమయ్యాయి. గత సెషన్‌లో భారీ లాభాలు నమోదు చేసిన సూచీలు ఈరోజు ప్రారంభంలో స్థిరంగా కదలాడాయి.  పూర్తి వార్త చదవండి →

మరిన్ని వార్తలు