భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు

26-11-2026 | 08:36pm

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కరీంనగర్, నవంబరు 26 (విజయ క్రాంతి): భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister for Social Welfare, Adluri Laxman Kumar) అన్నారు. గురువారం 77వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ పూలమాల వేసిన నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశానికి లేని రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందే విధంగా భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించారని అన్నారు. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కును కల్పించి ఆ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఒక గొప్ప అవకాశాన్ని రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు కల్పించారని అన్నారు. 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. దేశంలోని బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ రాజ్యాంగం ద్వారా కల్పించి బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  దారి చూపించారని అన్నారు.  అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తనలాంటి వాళ్లు రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రి అయ్యే అవకాశం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు