ఎల్ఓసిని అందించిన నియోజకవర్గ ఇన్చార్జి

26-11-2026 | 08:19pm

బోథ్. నవంబర్ 26 ( విజయక్రాంతి): మండల కేంద్రానికి(Mandal headquarters) చెందిన ఆడెపు రాజు కుమార్తె వైద్య చికిత్సల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన మూడు లక్షల రూపాయల ఎల్ఓసిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ(Congress Party Constituency) ఇన్చార్జి ఆడే గజేందర్ అందించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో మంజూరైన పత్రాలను హైదరాబాదులో అందజేయడం జరిగింది. కార్యక్రమంలో బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మెరుగు భోజన్న మురళి గౌడ్ ఎండి సద్దాం తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు