నూతన వధూవరులకు మాజీ ఎంపీ నామ ఆశీస్సులు
ఖమ్మం, నవంబర్ 26 విజయక్రాంతి: ఖమ్మం కార్పొరేషన్(Khammam Corporation) పరిధిలోని శ్రీరామ్ నగర్ వాస్తవ్యులు బిచ్చాల తిరుమలరావు–రజని దంపతుల కుమారుడు సూర్య వివాహం సూర్యాపేటకు చెందిన బట్టిపల్లి వెంకటేశ్వర గౌడ్–ధనలక్ష్మి దంపతుల కుమార్తె మౌనికతో ముదిగొండ రోడ్లోని వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం ఉదయం ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనకమేడల సత్యనారాయణ, మోరంపూడి ప్రసాద్ రావు, వాకదాని కోటేశ్వరరావు, రేగళ్ల కృష్ణ ప్రసాద్, పలువురు అడ్వకేట్లు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.