జాతీయస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక
26-11-2026 | 08:14pm
నిర్మల్ నవంబర్ 26 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్(Telangana State Residential) బాలికల బాలికల గురుకుల గురుకుల పాఠశాల, కళాశాల సోఫీ నగర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ప్రతిభ సాధించారు. ఎస్ సి ఈ ఆర్ టి రాష్ట్రస్థాయి హైదరాబాద్ పోటీల్లో ఫోక్ సాంగ్ విభాగంలో ప్రతిభ సాధించి ఐదుగురు విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక అయినట్టు ప్రిన్సిపల్ డేనియల్ తెలిపారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి నృత్య పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం లభించినట్టు ఆయన వివరించారు. తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల చెందిన విద్యార్థులు ప్రతిభ సాధించిన సందర్భంగా పాఠశాలలో ఘనంగా అభినందించారు.