అవగాహనతోనే అద్భుత పథకాలు సొంతం
బాలానగర్ : మండలం పరిధిలోని హేమాజీపూర్ గ్రామంలో(Hemajipur Village) శుక్రవారం తపాలా శాఖ(Department of Posts) ఆధ్వర్యంలో సమాజ అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు తపాలా శాఖ(Department of Posts) అందిస్తున్న వివిధ పొదుపు, జీవిత బీమా పథకాలపై(Life insurance plans) అవగాహన కల్పించారు.
సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ పొదుపు పథకం, తపాలా జీవిత బీమా(Postal Life Insurance), గ్రామీణ తపాలా జీవిత బీమా తదితర పథకాల ప్రయోజనాలను వివరించారు. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకోవడంతో పాటు, ఆర్థిక భద్రతకు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భైరమోని వసంత యాదగిరి, ఉపసర్పంచ్ విజయ విష్ణు, మురళి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవలు, పొదుపు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.