సీఎంను కలిసిన ఖేడ్ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు

23-10-2026 | 10:33pm

దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు 

 నారాయణఖేడ్, అక్టోబర్ 23 : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్ నియోజకవర్గ(Narayankhed Constituency) శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి(Patlolla Sanjeeva Reddy), సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని(Enumula Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి విజయదశమి(Vijayadashami) పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని పలు కీలక అభివృద్ధి పనులు(Development works), ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు. వెనుకబడిన నారాయణఖేడ్ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన, సాగునీరు, తాగునీరు, రహదారుల విస్తరణ, విద్య, వైద్య రంగాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వినతిపత్రం అందజేసి విజ్ఞప్తి చేశారు.

దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సానుకూలంగా స్పందించరాని 

ప్రజా ప్రభుత్వంలో నారాయణఖేడ్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యతనిస్తామని సీఎం పేర్కొన్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు