కో-బ్రాండెడ్ 'ఎటర్నల్కార్డ్' ప్రారంభించిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: భారతదేశంలో అతిపెద్ద ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ జారీ సంస్థ అయిన ఎస్ బీఐ కార్డ్(SBI Card), ఎటర్నల్ లిమిటెడ్ (గతంలో జొమాటో లిమిటెడ్) కలిసి ఈ రోజు ఎటర్నల్ ఎస్ బీఐ కార్డ్‌ను ప్రారంభిస్తూ, దాని కోసం ‘ఎర్లీ యాక్సెస్’ను ప్రకటించాయి. ఎటర్నల్, దాని అనుబంధ సంస్థల కస్టమర్ల కోసం రూపొందించిన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ఇది.
ఒకే ఎకోసిస్టమ్‌లోని పలు బ్రాండ్లపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు అందించే మొదటి కార్డ్‌లలో ఇది ఒకటి. కస్టమర్ల రోజువారీ కొనుగోళ్లకు మరింత విలువను అందించడంతో పాటు, ఎటర్నల్ గ్రూప్ బ్రాండ్లకు వెలుపల కూడా ఈ కార్డ్ ప్రయోజనాలను విస్తరిస్తుంది. కస్టమర్లు ఇప్పుడే జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్ యాప్‌ల ద్వారా ఎర్లీ యాక్సెస్ కోసం అభ్యర్థించవచ్చు. 2026 అక్టోబర్ 22 నుండి దశలవారీగా కార్డ్ అందుబాటులోకి వచ్చినప్పుడు, దరఖాస్తు చేసుకోవడానికి వారికి ఆహ్వానం అందుతుంది.
కార్డ్‌హోల్డర్లు జొమాటో, డిస్ట్రిక్ట్, బ్లింకిట్‌లలో (బ్లింకిట్‌లో ఎలక్ట్రానిక్స్, బ్యూటీ కేటగిరీలోని ప్రొడక్ట్‌లపై మాత్రమే) జరిపే లావాదేవీలపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందుతారు. బ్లింకిట్‌లో మిగతా అన్ని కేటగిరీల కొనుగోళ్లపై (దిగువ పేర్కొన్న కొన్ని మినహాయింపు కేటగిరీలు తప్ప) 5% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పైన పేర్కొన్న అన్ని ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరిపే కొనుగోళ్లపై ఈ డిస్కౌంట్లకు కలిపి నెలకు ₹2000 పరిమితి ఉంటుంది.
అదనంగా, బిస్ట్రోపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్, డిస్ట్రిక్ట్ ద్వారా సినిమా టికెట్ల కొనుగోలుపై 1+1 ఆఫర్ ఉన్నాయి (ఎటర్నల్ బ్రాండ్లపై ఉన్న అన్ని డిస్కౌంట్లు ఆయా ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటికే ఉన్న ఆఫర్లకు అదనం). ఎటర్నల్ SBI కార్డ్‌తో కస్టమర్లు అపోలో 24|7, ఇక్సిగో, ఉబర్, అర్బన్ కంపెనీలకు సంబంధించి చేసే ఖర్చులకు నెలకు ₹1,000 వరకు 5% క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఎటర్నల్ SBI కార్డ్‌లో క్యాష్‌బ్యాక్ ఆటో-క్రెడిట్ సదుపాయం ఉంది. దీని ద్వారా అర్హత ఉన్న లావాదేవీలపై వచ్చే క్యాష్‌బ్యాక్, స్టేట్‌మెంట్ జనరేట్ అయినప్పుడు నేరుగా SBI కార్డ్ అకౌంట్‌కు ఆటోమేటిక్‌గా క్రెడిట్ అవుతుంది. SBI కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల పాండే మాట్లాడుతూ, “కస్టమర్ల విభిన్న జీవనశైలికి, అభిరుచులకు తగ్గట్టుగా రూపొందించిన ప్రొడక్ట్‌లను అందిస్తూ, వారికి గరిష్ఠ విలువను, మెరుగైన అనుభవాన్ని అందించడానికి SBI కార్డ్ ఎల్లప్పుడూ కృషి చేస్తోంది.
ఎటర్నల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఎటర్నల్ SBI కార్డ్‌ను ప్రారంభించడం ఈ నిబద్ధతకు నిదర్శనం. కస్టమర్ల రోజువారీ ఖర్చుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ కార్డ్, ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు, సౌలభ్యం, విలువను అనేక కేటగిరీల్లో ఒకే చోట అందిస్తుంది. ఈ లాంచ్ మా రిటైల్ కో-బ్రాండ్ క్రెడిట్ కార్డ్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తుందన్నారు. మాస్టర్‌కార్డ్, రూపే నెట్‌వర్క్‌లు రెండింటిలోనూ అందుబాటులో ఉన్న ఈ క్రెడిట్ కార్డ్ కోసం, కస్టమర్లు జొమాటో, బ్లింకిట్ లేదా డిస్ట్రిక్ట్ మొబైల్ యాప్‌ల ద్వారా పూర్తిగా డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియతో దరఖాస్తు చేసుకోవచ్చు.