యువతిపై ఇద్దరు మైనర్ బాలురూ దాడికి యత్నం

23-10-2026 | 11:10pm

బాన్సువాడ ప్రెస్ కాలనీ సమీపంలో ఘటన...

పోలీసుల అదుపులో ఇద్దరు మైనర్ బాలురు...

బాన్సువాడ, అక్టోబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని ఓ డయోగ్నస్టిక్ సెంటర్(Diagnostic Center) లో శుక్రవారం రాత్రి విధులు(Night duties) ముగించుకొని రెండు పడక గదుల్లో తన నివాసానికి ఒంటరిగా వెళుతున్న యువతి నీ ఇద్దరు మైనర్ బాలురు(Minor boys) బాన్సువాడ లోని ప్రెస్ కాలనీ సమీపంలోకి రాగానే నిర్మానుషమైన ప్రాంతంలో యువతి కేకలు వేయకుండా ముందు జాగ్రత్తగా నోటిని మూసివేసి, దాడికి పాల్పడినట్లు సమాచారం.

వారి నుంచి తప్పించుకొని కేకలు వేయడంతో, ఇద్దరు మైనర్ బాలురు పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, ఆ ఇద్దరు మైనర్ బాలురలను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అత్యాచారం ప్రయత్నం(Attempted rape) చేయడానికి ప్రయత్నించారా? లేక కిడ్నాప్ కు ప్రయత్నించారా? అన్న విషయాన్ని పోలీసుల విచారణలో(Police investigation) వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు బాలురు మద్యం మత్తులో(Alcohol intoxication) ఉన్నట్లు సమాచారం. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు