పాముకాటు బాధితుడిని పరామర్శించిన వైస్ చైర్మన్ సుధాకర్
వికారాబాద్, అక్టోబర్- 23 : వికారాబాద్(Vikarabad) వార్డ్ నెంబర్ 10 జీడిగడ్డకు చెందిన పార్టీ కార్యకర్త శీనుకు(Seenu) పాము కాటు(Snakebite) వేయడంతో వికారాబాద్ మిషన్ హాస్పిటల్(Mission Hospital) లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ అర్థ సుధాకర్ రెడ్డి(Shri Artha Sudhakar Reddy) గారు మిషన్ హాస్పిటల్ కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. వారి వెంట కౌన్సిలర్ వినోద్ కుమార్ గారు. మాజీ కౌన్సిలర్ మురళి గారు శ్రీకాంత్ గారు. ఏ నాగరాజు గారు నారాయణ ఉన్నారు.
బాధితుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.