పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

23-10-2026 | 10:04pm

మహబూబ్‌నగర్,  (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బోయపల్లి డివిజన్‌లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పండుగ సాయన్న విగ్రహం(Statue of Panduga Sayanna) నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ నగర మేయర్ గుమాల్ మమత, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పెద్ద విజయ్ కుమార్, పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్,

పండుగ సాయన్న జీవిత చరిత్ర పుస్తక రచయిత బెక్కం జనార్దన్, బోయపల్లి డివిజన్ కార్పొరేటర్ మీరాబాయి, 38వ డివిజన్ కార్పొరేటర్ పిట్టల యాదయ్య, మాజీ మున్సిపల్ ఉపాధ్యక్షుడు తాటి గణేష్, న్యాయవాది ఎన్.పి. నేహశ్రీ, బోయపల్లి మత్స్యకార సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, ముదిరాజ్ సంఘం నాయకులు వడన్న, పిట్ల యాదన్న, లింగం, బడిగే సత్తయ్య, చిన్నయ్య, రాజు, కుమార్, సత్యం, శ్రీనివాస్ నాయక్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు