వ్యర్ధాల నిర్వహణ అవగాహన కార్యక్రమo

28-10-2026 | 06:38pm

నేరేడుచర్ల,అక్టోబర్ 28(విజయ క్రాంతి): పిఎం, శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(PM, Sri Zilla Parishad High School) నేరేడుచర్ల నందు బుధవారం నాడు ఎకో క్లబ్ మరియు యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో వ్యర్ధాల నిర్వహణ  అవగాహన కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు బట్టు మధు నేతృత్వంలో పాఠశాల ఎకో క్లబ్ ఇన్చార్జ్, జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఎం జానకి రాములు వ్యర్ధాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

యంగ్ ఎర్త్ లీడర్స్ మెంటార్ పిడి ఎం.యాదగిరి మాట్లాడుతూ... వ్యర్ధాలు  తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వేస్ట్, ఈ వేస్ట్ లుగా విభజించి నిర్వహించుకోవాలని పాఠశాలలో వ్యర్థ పదార్థాల నిర్వహణ చేయడం వలన విద్యార్థులలో పర్యావరణం పై అవగాహన పెంచడంతోపాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను  చేసే అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం సైదులు,రషీద్ ఖాన్, శౌరి,వెంకటేశ్వరరావు,నరసింహారావు,నాగమణి,వెంకటరెడ్డి,భానుమతి,బికోజి,రామ్మూర్తి,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు