అర్నాబ్ తుఫాన్ హెచ్చరికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం
- సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
భద్రాచలం టౌన్, అక్టోబర్ 28, (విజయక్రాంతి): అర్నాబ్ తుఫాన్ హెచ్చరికలు(Arnab's storm warnings) నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలలోనీ సమస్యలు తెలియజేయడానికి సబ్ కలెక్టర్ కార్యాలయంలో తుఫాన్ హెచ్చరికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల శ్రేష్ట(Sub-Collector Mrinal Shrestha) ఒక ప్రకటనలో తెలిపారు.
భద్రాచలం డివిజన్లోని మండలాలు మరియు గ్రామాలలో అర్నాబ్ తుఫాన్ కారణంగా ఏమైనా సమస్యలు ఉంటే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08743-232444, ఫోన్ చేసి సమస్యలు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు.