సైబర్‌ నేరాలపై బాలలకు అవగాహన అవసరం

28-10-2026 | 07:55pm
  1. సురక్షిత్ బచ్‌పన్ అభియాన్‌లో భాగంగా జిల్లాలో అవగాహన కార్యక్రమాలు
  2. సీనియర్ సివిల్ జడ్జి తాడూరు మహతి వైష్ణవి

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 28 (విజయ క్రాంతి):సైబర్‌ నేరాలపై బాలలకు అవగాహన అవసరమని సురక్షిత్ బచ్‌పన్ అభియాన్‌లో(Surakshit Bachpan Abhiyan) భాగంగా జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని సీనియర్ సివిల్ జడ్జి తాడూరు మహతి వైష్ణవి(Senior Civil Judge Taduru Mahati Vaishnavi) అన్నారు.

జాతీయ, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు *‘సురక్షిత్ బచ్‌పన్ అభియాన్’*లో(Surakshit Bachpan Abhiyan) భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో బాలల పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

భూపాలపల్లి మండలం గోర్లవీడు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి తాడూరు మహతి వైష్ణవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ బంగారు భవిష్యత్తు నేటి బాలల పరిరక్షణతోనే సాధ్యమవుతుందని అన్నారు. పోక్సో నేరాల నివారణతో పాటు సైబర్ మోసాల నుంచి పిల్లలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. 

కొత్తపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ పాల్గొని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

పెద్దాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల మాట్లాడుతూ ప్రతి బిడ్డ బాల్యం మనందరి బాధ్యత అన్నారు. చాలామంది పిల్లలకు తమ హక్కులు, అవసరమైనప్పుడు సహాయం ఎలా పొందాలో తెలియదని, ఈ పరిస్థితిని మార్చడమే ‘సురక్షిత్ బచ్‌పన్ అభియాన్’ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ

కార్యక్రమాల్లో జిల్లా బాలల పరిరక్షణ అధికారి వెంకటస్వామి, సూపరింటెండెంట్ రఘురాం, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, గోపాల్, రాజ్‌కుమార్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు