పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్ కుమార్
నేరేడుచర్ల, అక్టోబర్ 25(విజయ క్రాంతి): పెండింగ్ లో ఉన్న పే రివిజన్ కమిషన్(Pay Revision Commission) ను వెంటనే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్ కుమార్(Sirikonda Anil Kumar) డిమాండ్ చేశారు. నేరేడుచర్లలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకీడు మండల మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ,2024 తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) 15 రోజుల్లో పెండింగ్ డీఏలన్నీ ఇస్తామని, పీఆర్సీ అమలు చేస్తామని ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు(teachers and employees) అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు హామీలు నెరవేరలేదని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే పే రివిజన్ కమిషన్ నివేదిక తెప్పించుకుని తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న మిగిలిన నాలుగు కరువు భత్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కొత్త బడులు ఏర్పాటు చేసే బదులు ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేయాలని, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు మధ్యాహ్న భోజన రేట్లు పెంచాలని, పాఠశాలల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించాలని, ప్రభుత్వ బడుల పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగించేలా ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె. బాలసైదిరెడ్డి, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎన్. సాంబయ్య, నేరేడుచర్ల మండల కమిటీ అధ్యక్షులు ఆర్. శ్రీనయ్య, మండల ప్రధాన కార్యదర్శి బి. అక్కయ్య బాబు, గరిడేపల్లి మండల అధ్యక్షులు బి. నాగేశ్వరరావు, పాలకీడు మండల అధ్యక్షులు పి. వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు: ఎల్ శ్రీనివాసరావు;ఎన్. నరసింహారావు, నేరేడుచర్ల మండల ఎఫ్ డబ్ల్యూఎఫ్ కన్వీనర్ ఎన్. వెంకటేశ్వర్లు,
సిహెచ్. వెంకటేశ్వరరావు;
కె. వెంకటేశ్వరరావు, బి. వెంకట నరసయ్య, గరిడేపల్లి మండల ఎఫ్ డబ్ల్యూఎఫ్ కన్వీనర్ ఆర్. రవీందర్ రెడ్డి, వై. రామానుజం, ఎండి. మజీదా బేగం, డి. సైదమ్మ, టి. రాఘవరెడ్డి, బి. జైహింద్, ఎల్.వి. శేఖర్, బి. మహేష్, వి. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.