మండల నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక

25-10-2026 | 05:15pm

ఎర్రుపాలెం అక్టోబర్ 25 (విజయక్రాంతి): మండల నూతన ప్రెస్ క్లబ్(New Mandal Press Club) ఎన్నిక జమలాపురం గ్రామంలోని బాలాజీ భవన్ నందు ఆదివారం నాడు నిర్వహించారు. నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా తోట సాంబశివరావు, ప్రధాన కార్యదర్శిగా కోన రమేష్ ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను(Election process) గంధం శ్రీనివాసరావు, అంగిరేకుల రామకృష్ణ, కాపర్తి సతీష్ పర్యవేక్షించారు.

నూతన కార్యవర్గం సభ్యులు ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా యరమల శ్రీనివాసరెడ్డి, గౌరవ సలహాదారులు యనమందల విష్ణువర్ధన్ రావు. ముఖ్య సలహాదారులు గంధం శ్రీనివాసరావు, అంగిరేకుల రామకృష్ణ, కార్యదర్శి గ ఉయ్యూరు శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ గా నాగిరెడ్డి రమేష్, ఉపాధ్యక్షులు గా కుక్కల మురళీకృష్ణ, పసుపులేటి మహేష్, కోశాధికారి గా కాపర్తి సతీష్ ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులు గా మారబత్తుల సుష్మతేజ, వేమిరెడ్డి శివలింగారెడ్డి, ఆకుల రవి, బొబ్బిళ్లపాటి క్రిస్టఫర్, రాజారపు శ్రీనివాసరావు, బాణాల శంకరాచారి, కె. సుధాకర్ రెడ్డి, ఎం. వెంకట శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ సభ్యులకు మండలంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు , అనధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు