చిల్పూర్ బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు
25-10-2026 | 05:42pm
జనగామ, (చిల్పూర్) అక్టోబర్ 25 (విజయక్రాంతి): చిల్పూర్ గుట్టపై(Chilpur Hill) కొలువైన శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ(Endowments Department) ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ, మంగళవారం ఉదయం 10.00 గంటలకు ఆలయ హుండీలను తెరిచి లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి లక్ష్మీ ప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి భక్తులు, దేవాదాయ శాఖ అధికారులు హాజరుకానున్నారు.