యువతిని ఆస్పత్రికి తరలించిన బీజేపీ నేత
చందుర్తి,అక్టోబర్ 25, (విజయక్రాంతి) : ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు(Dr. Chennamaneni Vikas Rao) నిరూపించారు. మండలంలోని సనుగుల, లింగపేట గ్రామాలలో కుటుంబాల పరామర్శకు వచ్చిన అయన పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో చందుర్తి గ్రామ(Chandurthi village) శివారులో బైక్ అదుపుతప్పి గాయాలపాలైన యువతిని గమనించిన ఆయన వెంటనే స్పందించారు.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌ను రప్పించి, గాయపడిన యువతిని సమీపంలోని వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి(Vemulawada Government Hospital) తరలించేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాద సమయంలో బాధితురాలికి సకాలంలో సహాయం అందించి, వైద్యం అందేలా చొరవ చూపిన డాక్టర్ చెన్నమనేని వికాస్ మానవత్వాన్ని పలువురు అభినందించారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ద్వారా తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు.