బతుకుతో ముడిపడిన పండుగ బతుకమ్మ
తీరొక్క పూలతో బతుకమ్మ తయారీ
తొమ్మిది రోజులు ఆటపాటలతో పల్లెల్లో సందడి
తుంగతుర్తి, అక్టోబర్ 8: తెలంగాణ(Telangana) రాష్ట్ర సాంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీక, దేశ, విదేశీయులు మెచ్చిన ఆటపాటలతో పాడుతూ ఒకచోట మహిళలు ఐకమత్యముతో కలిసి, ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ(Bathukamma Festival).
బతుకమ్మ అంటే.. బతుకు అమ్మ అని అర్థం. లేదా దేవత జీవించి ఉన్నదని అర్థం. మహాలయ అమావాస్య రోజున ప్రారంభమై, సద్దుల బతుకమ్మ, తొమ్మిది రోజులపాటు ఆడుతూ, ఈ పండుగను మహిళలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తీరొక్క పూలతో,(తంగేడు, గునుగు, మందార, ఎర్రకట్ల పూలు, నీలంపూలు, బంతి, చామంతి, గులాబీ పూలతో) ఎంతో అందంగా , ఆలయ గోపురాన్ని తలపించేలా పేర్చి, మహిళలు బతుకమ్మను ఆడుతారు.
బతుకమ్మ.. తొమ్మిది రోజుల పండుగ
1) ఎంగిలిపూల బతుకమ్మ2) అటుకుల బతుకమ్మ3) ముద్దపప్పు బతకమ్మ4) నాన్న బియ్యం బతుకమ్మ 5)అట్ల బతుకమ్మ6) అలిగిన బతుకమ్మ( ఈరోజు బతుకమ్మ ఆడరు)7) వేపకాయల బతుకమ్మ8) వెన్నెముద్దల బతుకమ్మ9) సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ( చివరి రోజు)
బతుకమ్మ పండుగ విశేషాలు
ఆటలు, పాటలు: సాయంత్రం వేళలో మహిళలంతా కొత్త బట్టలు ధరించి, అందమైన గాజులు వేసుకొని, తలలో అందమైన పూలు ధరించి, ఆటపాటలు పాడుతూ, ఒకరి వెంట మరొకరు చుట్టు తిరుగుతూ, బతుకమ్మ ఉయ్యాల పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, నృత్యం, చేస్తూ, ఇచ్చు వాయనం పుచ్చువాయనం తీసుకుంటూ, ఆనందంగా గడుపుతారు.
నిమజ్జనం
మహిళలంతా ఒకే చోట తొమ్మిది రోజులు బతుకమ్మను పేర్చుకొని వెళ్లి, ఆటలాడుతూ, పాటలు పాడుతూ, చివరి రోజున చెరువులో గాని కుంటలో గాని, నిమజ్జనం చేసి వెళ్లి, వెళ్లి రావమ్మా అని చెబుతూ, కుటుంబ సభ్యుల ఆనందంగా ఉండాలని కోరుకుంటారు.
గ్రామాల్లో మహిళల ఐకమత్యమే బతుకమ్మ పండుగ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని, మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతుండడం, మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు ప్రారంభించడం, వ్యాపార వ్యాణిజ్యపరంగా అభివృద్ధి పెరిగి, అందరిమిచ్చే పండుగ, గర్వించదగ్గ విషయం.
ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్న మహిళలంతా బతుకమ్మ పండుగ రోజు, ఒకే చోట కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, తొమ్మిది రోజుల పాటు గ్రామాల్లో సందడి వాతావరణం, ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఆమె ఆనందంతో పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిదర్శనం, నాటినుండి నేటి వరకు, దేశ విదేశాల్లో సైతం, కులమతాలకు అతీతంగా, మహిళలు ఆడుకునే అతిపెద్ద పండుగగా బతుకమ్మను వర్ణిస్తారు.
అనురాధా కిషన్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు