మన డీఎన్‌ఏ రకాన్ని తెలిపే చిత్రమిది

09-10-2026 | 05:35am

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి(Ranabali)’. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. విజయదశమి సందర్భంగా ఈ నెల 16న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిపారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “మనకు తెలియకుండా దాచిన చరిత్రను సరిదిద్దే ప్రయత్నం ‘రణబాలి’ చేయబోతున్నాడు.

ఆ వీరుల బుక్రథల్ని, చరిత్రను ప్రపంచమంతా చూసేలా బిగ్ స్క్రీన్ మీద ఎక్సిపీరియన్స్ చేసేలా ఆ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేలా ‘రణబాలి’ ఉంటుందని నమ్ముతున్నా. ఈ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వస్తున్న గొప్ప స్క్రిప్ట్ ఇదేననిపించింది. కథే కాదు రణబాలి, జయమ్మ, హెక్టార్, మా అమ్మ ఊరైన శింగనమల... అంతా ఎంతో గొప్పగా రాశాడు రాహుల్. నా కెరీర్‌లో ‘రణబాలి’ ఒక పెద్ద హైలైట్‌గా నిలిచిపోతుందని నమ్ముతున్నా. మనం ఎలాంటివి దాటుకుని ఇక్కడి దాకా వచ్చాం.. మనలో ఎలాంటి డీఎన్‌ఏ ఉందని తెలుసుకునేందుకు ప్రేక్షకులు సినిమా చూడాలి. ఈ చిత్రంలో భాగమవడం గర్వంగా ఉంది. రష్మిక ఈవెంట్‌కు రానందుకు నా తరపున సారీ. నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్లు తమ జీవితాలు గొప్పగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి.

నా కలలు, నా శ్రమ వాళ్లకు అనవసరం అనిపిస్తే నేనాగాలా? నా హానెస్టీ వాళ్లకు అహంకారం అనిపిస్తే, నా ఆత్మవిశ్వాసం వాళ్లకు బలుపు అనిపిస్తే నేను తగ్గాలా, నా జర్నీ వాళ్లకు అర్థం కాకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా, నేను మారను. వాళ్లు మారాలి. మీరు కూడా బాగుపడితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా బాగుంటారు. ఇలా వెనక్కి లాగే పనులు చేస్తే ఉపయోగం ఉండదు. కొందరు గ్రూప్‌గా మారి ఇలాంటి నెగిటివిటీ తయారుచేస్తుంటారు” అన్నారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ మాట్లాడుతూ.. “అప్పట్లో సినిమాలు కూడా లేని టైమ్‌లో బుర్రకథల ద్వారానే వీరుల గాథలు ప్రజలకు తెలిసేవి. అలాంటి ఒక వీరుడి కథ బుర్రకథ రూపంలో నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ వీరుడి కథ విని నేను షాక్ అయ్యా.

ఇలాంటి సినిమా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. రెండేళ్లలో కోటి మంది ఆకలితో చనిపోవడం సాధ్యమా అనిపించింది. ఇది నిజమైతే పాఠ్య పుస్తకాల్లో ఈ కరువు గురించి ఎందుకు చెప్పలేదని పరిశోధన మొదలుపెట్టా. నాతోపాటు విజయ్ కూడా ప్రపంచానికి చెప్పాల్సిన కథ ఇది అని నమ్మారు. ఈ సినిమా కోసం నాలుగేళ్లు శ్రమించాం. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే ఐదు నిమిషాల్లో మనకు ఫుడ్ వస్తుంది. కానీ, ఆహారం దొరక్క కోటి మంది మన పూర్వీకులు చనిపోయారంటే ఎంత దారుణం. ఈ కోపం నుంచి ఆక్రోశం నుంచి పుట్టిందే ఈ సినిమా. రణబాలి సినిమా ఒక యుద్ధంలా ఉంటుంది” అన్నారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ కూడా ఈ ఈవెంట్‌లో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు