స్కామ్‌ల గని సింగరేణి
- ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలతోనే సంస్థకు నష్టాలు
- కొత్త మైన్స్ ఓపెన్ చేయడంలో విఫలం
- బొగ్గు ఉత్పత్తి తగ్గుదలపై డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలి
- దసరా వచ్చినా.. లాభాల్లో కార్మికుల వాటా ఏదీ?
- 14న రామగుండంలో ‘సింగరేణి కార్మిక గర్జన’
- మాజీమంత్రి హరీశ్‌రావు వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) ఆరోపించారు. సకాలంలో మైన్స్ ఓపెన్ చేయక, చేతగాని నిర్ణయాల వల్ల సంస్థను నష్టాల్లోకి నెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో బొగ్గు లేక థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆపేశారని, దీంతో రైతులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి ఎందుకు తగ్గిం దో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గురువారం తెలంగాణ భవన్‌లో టీబీజీకేఎస్, సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధుల సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నిర్వాకంతో సింగ రేణి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. దసరా ముందు సంస్థ లాభాలను డిక్లేర్ చేయడం, లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వడం ఆనవాయితీ అని, పండుగా వస్తున్నా ప్రభుత్వం ఆ ప్రస్తావన తేవ డం లేదన్నారు. కేసీఆర్ హయాంలో సంస్థ లాభాల్లో 32 శాతం వాటా కార్మికులకు ఇచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో కేవలం 16 శాతమే ఇచ్చిందని పేర్కొన్నారు.
మాటల్లో 33 శాతం చెప్పి, ఇచ్చిం ది కేవలం 16 శాతం వాటా మాత్రమేనన్నారు. వచ్చిన లాభాల్లో భవిష్యత్తు అవసరాల పేరిట పక్కన బెట్టి వాటా పంచారని, కార్మికులకు ప్రభు త్వం తీరని అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు పూర్తి వాటా ఇవ్వాలని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, బకాయిలు చెల్లించాలని, ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయాలని, డిపెండెంట్ ఉద్యోగాల కోసం మెడికల్ బోర్డు నిర్వహించి అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్లతో ఈనెల 14న రామగుండంలో ‘సింగరేణి కార్మిక గర్జన’ పేరుతో బహిరంగ సభ నిర్వ హించనున్నట్లు తెలిపారు. ఈ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని హరీశ్‌రావు వెల్లడించారు.
పాలనా వైఫల్యమే..
అవినీతి, బంధుప్రీతి, అడ్డగోలు నిర్ణయాల వల్లే సింగరేణి పరిస్థితి అగమ్యగోచరంగా మా రిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. 2022 రూ.2,022 కోట్లు, 2023 రూ.4,712 కోట్లు, 2024 రూ.6,394 కోట్లు లాభా లు వచ్చాయని, ఈ సంవత్సరం లాభాలను ఇప్పటి వరకు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఈ ఆర్థిక సంవత్సరం లాభాలు రూ. 1,800 కోట్లు కూడా మించే అవకాశం లేదని పేర్కొన్నారు. మూడు వంతులు లాభాలు తగ్గడానికి కారణం ఎవరు?, పాలనా వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు.
గతంలో ఒక్కో కార్మికుడి సగ టు బొగ్గు ఉత్పత్తి షిఫ్ట్‌కు 6.39 టన్నులు ఉండగా, ఈ ఏడాది 7.56 టన్నులకు పెరిగిందన్నారు. కార్మికులు అద్భుతంగా పని చేస్తున్నా, రేవంత్ తుగ్లక్ నిర్ణయాల వల్ల సింగరేణి నష్టా ల్లో కూరుకుపోయిందన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన, నెలల తరబడి టెండర్లు వాయి దా, అధిక ధరలకు టెండర్లు, రేవంత్ బామ్మర్దికి టెండర్లు ఇవ్వడం కూడా నష్టాలకు కారణమని పేర్కొన్నారు. 2023 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా, 2025 58 మిలియన్ టన్నులకు పడిపోయిందని, 12 మిలియన్ టన్నుల మేర ఉత్పత్తి తగ్గిందని వివరించారు.
బీఆర్‌ఎస్ హయాంలో బొగ్గు ఉత్పత్తి పెరిగిందని, కాంగ్రెస్ రాగానే ఎందుకు తగ్గిందో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాయితీగా పని చేసే అధికారులను మంచి డైరెక్టర్లను తొలగించారని, సింగరేణికి చెల్లింపులు రూ. 50 వేల కోట్లు దాకా ఆగిపోయాయని, ప్రభుత్వం నుంచి జెన్కో నుంచి చెల్లింపులే లేవని స్పష్టం చేశారు. కార్మికులకు లాభాల్లో వాటా పంచకుండా రూ. 6,323 కోట్లు బ్యాంకుల్లో దాచి పెట్టారని, మరి 4వేల కోట్ల ఓడీ ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. జీతాలకు ఎందుకు అప్పులు తేవాల్సిన పరిస్థితి వచ్చిందని నిలదీశారు.
కిషన్‌రెడ్డి చొరవ చూపాలి..
సంస్థను కాపాడుకునేందుకు కేంద్ర బొగ్గు మంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపాలని హరీశ్‌రావు కోరారు. 40 లక్షల టన్నుల బొగ్గు లేకుండానే ఉన్నట్లు చూపారని, మేం మాట్లాడితే బుకాయించారని, దీనిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకో వడం లేదన్నారు. జీవో 76 మేం తెచ్చిందేనంటూ అసెంబ్లీ సమావేశాల్లో గొప్పలు చెప్పుకు న్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సింగరేణి కార్మికులకు ఇంటి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2019లో జీవో ఇచ్చారని పేర్కొన్నారు.
కానీ, మంత్రి పొంగులేటి మాత్రం వైఎస్ హయాంలో ఈ జీవో ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. సింగరేణి ప్రాంతంలో 30 వేల మందికి ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేసి అప్పగించారని, కాంగ్రెస్ రాగానే జీవోను పక్కన బెట్టి నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. ఒక్క మంచిర్యాలలోనే వేల జాగలు నిషేధిత జాబితాలో చేర్చారని మం డిపడ్డారు. మూడేళ్లు ఏం చేయకుండా బిగ్ రిలీ ఫ్, కార్మికులకు శుభవార్త అంటున్నారని, కార్మికుల ఉసురు పోసుకున్నందుకు వారికి క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే జీవో 76 కింద మిగిలిన కార్మికులకు సేల్ డీడ్ ద్వారా హక్కులు కల్పించాలని, బీఆర్‌ఎస్ హయాంలో మాదిరిగా, కార్మికులకు ప్రతి నెలా 3 మెడికల్ బోర్డులు పెట్టి, డిపెండెంట్ ఉద్యాగాలు ఇవ్వాలన్నారు.
కేసీఆర్ 16 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారని,4వేల మందికి పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చారని, మొత్తంగా 20వేల మంది కి ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. డిపెండెంట్ ఉద్యోగాల మీద అప్రకటిత నిషేధాన్ని పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే చర్యలను మానుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని, సింగరేణి కార్మికుల సమస్యల పట్ల ప్రత్యక్ష పోరాటానికి సిద్దం అవుతున్నదని హెచ్చరించారు. సింగరేణి కార్మిక గర్జనకు కార్మికులు, సింగరేణి ప్రాంత ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.