తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా మస్తాన్ నియామకం

30-09-2026 | 09:12pm

హుజూర్ నగర్: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల(Telangana Culture and Traditions) పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తానని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్ తెలిపారు. బుధవారం పట్టణానికి చెందిన షేక్ మస్తాన్ ను తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)  హైదరాబాదులోని కేంద్ర కార్యాలయంలో నియమక పత్రం అందించారు.

ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన షేక్ మస్తాన్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంతోపాటు జాగృతి సంస్థలో వివిధ పదవుల్లో గత 18 సంవత్సరాల నుండి వివిధ హోదాల్లో  పనిచేస్తూ నేడు జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన కల్వకుంట్ల కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా షేక్ మస్తాన్ ఎన్నికైన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు,జాగృతి సంస్థ నాయకులు,పలువురు నాయకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు