వేల్పూచర్లలో పంటల పరిశీలన
07-11-2026 | 08:59pm
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండలంలోని వేల్పూచర్ల గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ శాస్త్రవేత్తలు డాక్టర్ పరిమళ,డాక్టర్ చంద్రశేఖర్,డాక్టర్ సంధ్యారాణిలు శనివారం గ్రామంలోని వరి,ఆయిల్ పామ్ తోటలను పరిశీలించారు.అనంతరం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో మాట్లాడుతూ... కలుపు,పోషక యాజమాన్యం సరిగా చేపట్టాలని, వరి కొయ్యలను కాల్చకుండా నేలలో కలియదున్నాలని సూచించారు. ఎల్ నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా పెసర, మినుము, ఉలువ పంటలు వేయాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెరుకు వెంకటమ్మవెంకన్న,ఉప సర్పంచ్ వజ్జె రవి,మండల వ్యవసాయాధికారి గణేష్, ఏఈఓ సత్యం, రైతులు పాల్గొన్నారు.