మహిళా సమైక్య సంఘం భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

07-11-2026 | 08:57pm

భైంసా,(విజయక్రాంతి): భైంసా మండలం సిద్దూర్ గ్రామంలో మహిళా సమైక్య సంఘం నూతన భవనాన్ని శనివారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని తెలిపారు. గ్రామంలోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మహిళా సమైక్య సంఘానికి రూ.2 కోట్ల రుణ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు