ప్రజల కోసం బియ్యం ధరల నియంత్రణ

07-11-2026 | 08:42pm

- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

- అవుట్ లెట్ అవుట్ లెట్ ప్రారంభం

బెల్లంపల్లి: ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం బియ్యం ధరల నియంత్రణ చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని బెల్లంపల్లి(Bellampalli) మండల కేంద్రంలోని బెల్లంపల్లి డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకాల అవుట్ లెట్ ను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్, మండల తహసిల్దార్ కృష్ణ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల ప్రస్తుతం మార్కెట్ లో నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు అందరూ మానవతా దృక్పథంతో ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

ప్రభుత్వ నిర్ణీత ధరకే విక్రయాలు జరిగేలా రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల అధికారులతో ఆకస్మిక తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందనితెలిపారు. తనిఖీల కోసం వచ్చే బృందాలకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలని న్నారు. 26 కిలోల బరువుతో కూడిన బి.పి.టి. న్యూ రైస్ బ్యాగ్ ను 1 వేయి 326 రూపాయలు, పాత బియ్యంను 1 వేయి 612 రూపాయలు, హెచ్.ఎం.టి. స్టీమ్ బియ్యం బస్తా 1 వేయి 872 రూపాయలు, జై శ్రీరామ్ పాత బియ్యం 2 వేల 28 రూపాయల చొప్పున అవుట్ లెట్ ద్వారా నిబంధనల ప్రకారం విక్రయాలు జరుపాలని నిర్వాహకులకు సూచించారు.

మరిన్ని వార్తలు