మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
07-11-2026 | 08:23pm
బేల,(విజయక్రాంతి): బేల మండలం(Bela Mandal)లో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబాలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.