మహనీయుల విగ్రహాలతో కొత్త శోభ

30-09-2026 | 11:34am

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్ 29: మండల కేంద్రం అర్వపల్లిలోని ప్రధాన చౌరస్తాలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuelu) ఇటీవల శంకుస్థాపన చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్,జ్యోతిరావుపూలే, జగ్జీవన్ రామ్ మహనీయుల విగ్రహాల ఏర్పాటు పనులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాలను భావితరాలకు తెలిపేందుకు చౌరస్తాలో విగ్రహాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే సామేలు సహకారంతో త్వరలోనే విగ్రహావిష్కరణ పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్(Coordinator) జీడి వీరస్వామి,డీసీసీ కార్యదర్శి వేల్పుల రమేష్,సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్,మాజీ జెడ్పిటిసి కొర్రపిడత అవిలయ్య,టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని మనోహర్,ఇటికాల చిరంజీవి,కేసాని రాహుల్,అంజి,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు