భారత రెజ్లర్ విధ్వంసం

30-09-2026 | 09:27am

నాగోయా: ఆసియా క్రీడలు 2026లో భారత రెజ్లింగ్( Sunil Kumar wrestling) బరిలో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. గ్రెకో-రోమన్ 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్(Asian Games 2026) అదరగొట్టి సెమీఫైనల్‌కు దూసుకెళ్లగా.. మహిళల 68 కేజీల్లో నిషా దహియాకు నిరాశ ఎదురైంది. హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన సునీల్ కుమార్.. నాగోయాలోనూ తన దూకుడు కొనసాగించాడు. తజికిస్థాన్‌కు చెందిన మహమ్మద్ సుల్తోంజోదాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి టెక్నికల్ సుపీరియారిటీతో(Technical Superiority) విజయం సాధించాడు. ప్రత్యర్థి డిఫెన్సివ్‌గా వ్యవహరించడంతో అతడిని ‘పార్ టెర్రె’ పొజిషన్‌లోకి పంపారు. ఈ అవకాశాన్ని సునీల్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. వరుసగా గట్-వ్రెంచ్ మూవ్స్‌తో పాయింట్లు సాధిస్తూ పోరును ఎక్కువసేపు సాగనివ్వకుండా ముగించాడు. దీంతో సునీల్ కుమార్ ఆసియా క్రీడల రెజ్లింగ్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు.

నిషాకు మరోసారి అదే ప్రత్యర్థి షాక్

మరోవైపు మహిళల 68 కేజీల విభాగంలో నిషా దహియాకు(Nisha Dahiya loss) ఉత్తర కొరియాకు చెందిన సోల్ గమ్ పాక్ చేతిలో ఓటమి ఎదురైంది. తొలుత నిషా 2-0 ఆధిక్యంలోకి వెళ్లినా.. పాక్ నాలుగు పాయింట్ల మూవ్‌తో తొలి పీరియడ్‌ను 4-2తో ముగించింది. రెండో పీరియడ్‌లో నిషా రెండు పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరిలో ఎవరూ పాయింట్ సాధించకపోవడంతో.. పెద్ద మూవ్ చేసిన పాక్‌ను విజేతగా ప్రకటించారు. అయితే నిషా పోరాటం పూర్తిగా ముగిసిపోలేదు. సోల్ గమ్ పాక్ ఫైనల్‌కు చేరితే నిషాకు రిపెచేజ్ ద్వారా తిరిగి పోటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే ప్రత్యర్థి చేతిలో నిషా గతంలో పారిస్ ఒలింపిక్స్ క్వార్టర్‌ఫైనల్లోనూ(Paris Olympics quarter-finals) ఓడింది. ఇక సెమీఫైనల్‌లో సునీల్ కుమార్‌కు జపాన్‌కు చెందిన తైజో యోషిదాతో పోటీ పడే అవకాశం ఉంది. దీంతో భారత రెజ్లర్‌పై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

మరిన్ని వార్తలు