కొడంగల్‌లోనే ఇండ్లు కూల్చేస్తావా?

30-09-2026 | 05:20am
  1. రాత్రికి రాత్రే కూల్చే హక్కు ఎవరిచ్చారు?
  2. కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయవా?
  3. సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్ రావు ప్రశ్నలు

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): కొడంగల్(Kodangal) బిడ్డను అంటూ అక్కడి ప్రజల ఇండ్లనే కూల్చేస్తావా రేవంత్‌రెడ్డి?(Revanth Reddy) అని బీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు(Harish Rao) ప్రశ్నిం చారు. మంగళవారం సీఎం తీరును నిరసిస్తూ ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు. ‘మద్దూరులో రాత్రికి రాత్రే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను(Bulldozers on houses) నడిపించే హక్కు ఎవరు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నోటీసులు(Notices) కూడా ఇవ్వకుండా ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు’ అని హరీశ్‌రావు ప్ర శ్నించారు. న్యాయస్థానాలు(Courts) ఇచ్చిన తీర్పులను కూడా గౌరవించరా అని నిలదీశారు.

ఒక్కసారిగా ఇండ్లు కూల్చితే, ఏండ్ల నుం డి నివాసం ఉన్నవారు ఒక్కసారిగా ఎక్కడికి వెళ్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా, పోలీసులను అడ్డుపెట్టు కుని బుల్డోజర్‌రాజ్ అమలు చేస్తున్నారా అని మండిపడ్డారు. పేదల బతుకులను రోడ్డున పడేయడమేనా మీ ప్రజా పాలన అని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని గొప్ప గా చెప్పుకునే భూసేకరణ చట్టం(Land Acquisition Act) - 2013 ప్రకారం బాధితులకు తక్షణ న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. 20 నెలలుగా 4 వేల మంది స్వీపర్లకు జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇదేనా ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడ మంటే అంంటూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రశ్నలు సంధించారు. 

మరిన్ని వార్తలు