ఉజ్జయిని మహంకాళికి ‘శఠగోపం’?

30-09-2026 | 05:30am
  1. అమ్మవారి జాతర ఖర్చులపై వెల్లువెత్తిన ఆరోపణలు
  2. విజిలెన్స్ విచారణకు భక్తుల డిమాండ్

సికింద్రాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో(Secunderabad Sri Ujjaini Mahankali Temple) బోనాల జాతర సందర్భంగా నిధుల వినియోగంపై పలు ఆరోపణలు వెలువడుతున్నాయి. జాతర ఏర్పాట్లు, నైవేద్యాలు, పూల అలంకరణ, భోజన సదుపాయాలు తదితర అంశాల్లో ఖర్చుల విషయంలో పారదర్శకత పాటించలేదని కొంద రు భక్తులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా భక్తు లకు భోజన సదుపాయాలు కల్పించే వ్యవహారంలో టెండర్ ప్రక్రియను(Tender process) పూర్తిగా పాటించలే దనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పెద్ద మొత్తం లో ఖర్చయ్యే పనులను బహిరంగ టెండర్ల ద్వారా కేటాయించాల్సి ఉండగా, కొంతమంది వ్యక్తులకు పనులు అప్పగించారనే ఆరోపణలున్నాయి. అ యితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారిక రికార్డులు, టెండర్ పత్రాలు పరిశీలించిన తర్వాతే వాస్తవాలు తేలాల్సి ఉంది. భోజనాల ఖర్చులు, అందులో మిగిలిన మొత్తాల పంపకాలకు సంబంధించి రెండు మీడియా వర్గాల మధ్య వివాదం తలెత్తి పోలీస్టేషన్ వరకు వెళ్లిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అస లు ఎంత ఖర్చు చేశారు? ఎవరికెంత చెల్లించారు? బిల్లులు, వోచర్లు ఉన్నాయా? కాంట్రాక్టు ఏ విధం గా కేటాయించారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

అలాగే అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు, ఇతర కానుకల నిర్వహణ, వేలం ప్రక్రియపైనా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చీరల సేకరణ నుంచి వేలం, ఆదా యం ఆలయ ఖాతాలో జమయ్యే వరకు మొత్తం ప్రక్రియకు సంబంధించిన రికార్డులను పరిశీలించాలని భక్తులు కోరుతున్నారు. ఇలాంటి లైసెన్స్/ టెండర్ వ్యవహారాలు గతంలో న్యాయస్థానం దృష్టికి కూడా వెళ్లాయి. 2024లో హైకోర్టు(High Court) సం బంధిత కేసులో ఉజ్జయిని మహంకాళి ఆలయం లో చీరలు, బ్లౌజ్ పీసుల సేకరణ హక్కులకు సం బంధించిన టెండర్ నోటిఫికేషన్ అంశం ప్రస్తావనకు వచ్చింది.ఆలయంలో గతంలో జరిగిన ఉ ద్యోగ నియామకాల ప్రక్రియ పైనా ఆరోపణలు ఉన్నాయని, నియామకాల్లో నిబంధనలు పాటించారా? అర్హతలు, రిజర్వేషన్లు, ఎంపిక ప్రక్రియ ఎ లా జరిగింది? అనే అంశాలను పరిశీలించాలని భక్తులు కోరుతున్నారు.

ఆలయ ఈవో మనోహర్‌రెడ్డిపై(EO Manohar Reddy) వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ఉద్యోగ నియామకాలు(Job openings), బోనాల జాతర భోజనాల కాంట్రాక్టు, నైవేద్యాలు, పూల అలంకరణ, చీరల వేలం, ఆలయ నిధుల వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా రికార్డులను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆరోపణలు నిరాధారమై తే అధికారిక లెక్కలు, టెండర్ పత్రాలు, ఖర్చుల వివరాలను వెల్లడించి అనుమానాలకు తెరదించాలని భక్తులు కోరుతున్నారు. కొందరికి అనుకూ లంగా ఈవో వ్యవహరిస్తున్న విషయంపై కూడా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలంటున్నారు. 

మరిన్ని వార్తలు